![]() |
![]() |

'కార్తీక దీపం' సీరియల్ శుభం కార్డుకి ఇంకా ఒక్కరోజే ఉండడంతో.. క్లైమాక్స్ ఎలా ఉంటుదోననే సస్పెన్స్ అందరిలోను నెలకొంది. కాగా ఇప్పుడు ఈ సీరియల్ ఎపిసోడ్ -1568 లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. దీపకి ఫోన్ చేస్తాడు వారణాసి. "మోనిత ఇంకా హిమ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు" అని చెప్తాడు. వారణాసి అలా చెప్పడంతో అందరూ మోనిత ఇంటికి బయలుదేరుతారు. వెళ్తున్న దారిలో.. "మోనిత నీ కోసం ఎంతకైనా తెగిస్తుంది. నేను వెళ్ళాక కూడా మిమ్మల్ని ఇలాగే టార్చర్ చేస్తుంది. నా చివరి కోరిక ఉంది అదైనా తీరుస్తారా?" అని దీప అంటుంది. "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. నీతోనే నేను. అది భూమ్మీదైనా, స్వర్గంలోనైనా" అని కార్తీక్ చెప్తాడు.
మోనిత ఇంటికి అందరూ వెళ్తారు. హిమ తలపై గన్ పెట్టి బెదిరిస్తుంది మోనిత. అది చూసి భయంతో దీప కింద పడిపోతుంది. అయినా మోనిత కొంచెం కూడా కనికరం లేకుండా.. "నాకు రెండు కోరికలు ఉన్నాయి.. ఒకటి కార్తీక్ ని పెళ్ళికి ఒప్పించడం.. ఇంకొకటి దీప నోటితో నన్ను డాక్టర్ బాబు భార్య అని చెప్పాలి" అని తన కండిషన్స్ చెప్తుంది. తను చెప్పమన్నట్లు చెప్పకుంటే హిమని చంపేస్తానని బెదిరిస్తుంది. "నేను పోయాక ఎవరినో ఒకరిని చేసుకుంటారు కదా.. అదేదో మోనితనే పెళ్లి చేసుకోండి డాక్టర్ బాబు" అని దీప అనగానే మోనిత ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.
కార్తీక్, సౌందర్య ఇద్దరు "తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు దీప" అని చెప్తూ ఉంటారు. అంతలోనే తొందరగా మోనిత దగ్గరికి వెళ్ళి తన చేతిలోని రివాల్వర్ తీసుకుంటుంది దీప. ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |